Non Subsidy: పెరిగిన సబ్సిడీ వంట గ్యాస్ ధరలు!

LPG Price Hike in Metro Cities

  • రూ. 4.50 వరకూ పెంచుతున్నట్టు ప్రకటన
  • హైదరాబాదులో సిలిండర్ ధర రూ. 645.50 
  • తక్షణం అమల్లోకి వస్తాయన్న ఆయిల్ కంపెనీలు

వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర సిలిండర్ కు గరిష్ఠంగా రూ. 4.50 వరకూ పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో రూ. 4.50, చెన్నైలో రూ. 4, ముంబైలో రూ. 3.50, ఢిల్లీలో రూపాయి చొప్పున ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ రేటు హైదరాబాద్ లో రూ. 645.50, ఢిల్లీలో రూ. 594, కోల్ కతాలో రూ. 620.50, ముంబయిలో రూ. 594, చెన్నైలో రూ. 610కి చేరుకున్నాయి. కాగా, గత నెలలో కూడా వంటగ్యాస్ ధరలను మార్కెటింగ్ కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News