Tamilnadu: తమిళనాడులో బాయిలర్ పేలుడు.. నలుగురి మృతి.. 17 మందికి తీవ్ర గాయాలు

4 Dead 17 Injured In Boiler Explosion At Tamil Nadu Thermal Power Plant

  • నైవేలీ ఎన్‌ఎల్‌సీ యూనిట్‌-2లో  పేలుడు 
  • సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నైవేలీ ధర్మల్ పవర్ ప్లాంటు, ఎన్‌ఎల్‌సీ యూనిట్‌-2లో బాయిలర్‌ పేలుడు సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించాయి. అక్కడ చెలరేగుతోన్న మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ పేలుడుకి గల కారణాలపై స్పష్టత రాలేదు.

కొన్ని రోజులుగా ఈ బాయిలర్‌కు సంబంధించిన పనులు జరగడం లేదని అధికారులు మీడియాకు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. ఈ పవర్‌ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు సంభవించడం రెండు నెలల్లో ఇది రెండో సారి.

ఈ ఏడాది మేలో బాయిలర్ పేలుడు సంభవించి ఎనిమిది మంది కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్లాంట్‌లో రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తారు. ఈ సంస్థలో దాదాపు 27 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 15 వేల మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు. ఈ సంస్థ 3,940 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

  • Loading...

More Telugu News