Pilli Subhas Chandra Bose: పిల్లి సుభాష్, మోపిదేవిల రాజీనామాలు ఆమోదం

Pilli Subhash and Mopidevi resignations accepted
  • రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్, మోపిదేవి
  • ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా
  • ఎమ్మెల్సీ పదవులపై ఆశ పెట్టుకున్న పలువురు నేతలు
ఏపీ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలు ఆమోదం పొందినట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. వీరిద్దరి రాజీనామాలు ఆమోదం పొందడంతో శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

మరోవైపు మంత్రి పదవులకు కూడా పిల్లి సుభాష్, మోపిదేవిలు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి జగన్ కు అందజేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో... వాటి కోసం వైసీపీలో ఆశావహులు తమ ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
Pilli Subhas Chandra Bose
Mopidevi Venkataramana
AP Legislative Council
Resign

More Telugu News