Priyanka Gandhi: నెల రోజుల్లోగా బంగ్లాను ఖాళీ చేయండి: ప్రియాంకాగాంధీని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం

Priyanka Gandhi told to vacate govt bungalow in Delhi within a month

  • ఎస్పీజీ ప్రొటెక్షన్ లో లేని ప్రియాంకాగాంధీ
  • ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరీలో ప్రియాంక
  • ఆగస్ట్ 1 తర్వాత బంగ్లాలో ఉంటే డ్యామేజీ ఛార్జీలు, రెంట్ చెల్లించాల్సి ఉంటుందని నోటీసు

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని లోధీ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) భద్రతలో లేనందువల్ల బంగ్లాను ఖాళీ చేయాలని తెలిపింది. ఆగస్ట్ 1 తర్వాత కూడా బంగ్లాలో ఉంటే డ్యామేజీ ఛార్జీలు, రెంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పట్టణ, గృహ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఈ చేసింది.

గతంలో ఎస్పీజీ ప్రొటెక్షన్ లో ఉన్న ప్రియాంకకు 1997 ఫిబ్రవరి 21న లోధీ ఎస్టేట్ బంగ్లాను కేటాయించారు. గత నవంబర్ లో ప్రియాంకకు ఎస్పీజీ సెక్యూరిటీని తొలగించి, జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, కేంద్ర హోంశాఖ సిఫారసు ఉంటేనే జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వారికి నివాస సదుపాయాన్ని కల్పిస్తారు.

  • Loading...

More Telugu News