TV 9: అనుమతుల్లేకుండా రూ. 18 కోట్లు విత్‌డ్రా చేసినట్టు ఆరోపణ.. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడీ కేసు నమోదు

ED case filed against TV9 former CEO Ravi Prakash

  • టీవీ 9 మాతృసంస్థ నుంచి కోట్లాది రూపాయల ఉపసంహరణ
  • గతేడాది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రవిప్రకాశ్‌పై కేసు
  • ఆ కేసు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ

టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి అనుమతుల్లేకుండా పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న కేసు నమోదు చేసింది. సెప్టెంబరు 2018 నుంచి మే 2019 వరకు రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు అనుమతుల్లేకుండా రూ. 18 కోట్ల నిధులను విత్‌డ్రా చేసినట్టు కంపెనీ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబరులో ఈ విషయంలో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News