Nikki Haley: భారత్‌లో 59 చైనా యాప్‌ల నిషేధంపై నిక్కీ హేలీ వ్యాఖ్యలు

India is continuing to show it wont back down from Chinas aggression Nikki Haley

  • అమెరికా నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున మద్దతు 
  • పాప్యులర్ యాప్‌లపై భారత్ నిషేధం విధించడం శుభ పరిణామం 
  • టిక్‌టాక్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉంది
  • చైనా దూకుడుకి ఏ మాత్రం తలొగ్గని భారత్

తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన ముఖ్యమైన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా నుంచి భారత్‌కు మద్దతు వస్తోంది. ఆ యాప్‌లను నిషేధిస్తూ భారత్‌ తీసుకున్న చర్యలపై అమెరికా రాజకీయ వేత్త, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ స్పందించారు.

'టిక్‌టాక్‌తో పాటు చైనా సంస్థలకు చెందిన 59 పాప్యులర్ యాప్‌లపై భారత్ నిషేధం విధించడం శుభ పరిణామం. టిక్‌టాక్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. చైనా దూకుడుకి ఏ మాత్రం తలొగ్గకుండా భారత్‌ తన చర్యలను కొనసాగిస్తోంది' అని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News