ILO: ఈ ఏడాది ద్వితీయార్థంలో 34 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు: హెచ్చరించిన ఐఎల్ఓ

ILO warns risk of 34 crore job loss world wide

  • ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 14 శాతానికి తగ్గిన పనిగంటలు
  • ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రోడ్డున పడిన కోట్లాదిమంది
  • అభివృద్ధి చెందిన దేశాలలో పేలవంగా ఆర్థిక వ్యవస్థల ఫలితాలు  

కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఎలా వుందో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా, కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. తాజాగా, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మరో ఉపద్రవాన్ని సూచిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో 34 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఐఎల్ఓ హెచ్చరించింది.

ప్రపంచ పనిగంటల్లో ఇది 11.9 శాతానికి సమానమని నివేదిక పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రపంచ పనిగంటలు 14 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. ఇది ఇంచుమించు 400 మిలియన్ ఉద్యోగాలు కోల్పోయిన దానికి సమానమని వివరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక వ్యవస్థల ఫలితాలు పేలవంగా ఉన్నాయని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News