Reliance: మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ... వచ్చేసిన జియో ఉచిత కాలింగ్ యాప్ 'జియో మీట్'

Free Video Meeting App from Jio

  • జూమ్ తదితర యాప్ లపై పెరుగుతున్న వ్యతిరేకత
  • ఇన్విటేషన్ కోడ్స్ అవసరం లేకుండా సరికొత్త యాప్
  • అవకాశాన్ని అందిపుచ్చుకున్న రిలయన్స్ జియో

చైనా యాప్స్ ను నిషేధించడంతో, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. జూమ్ తదితర వీడియో కాలింగ్ యాప్ లకు ప్రత్యామ్నాయంగా, 'జియో మీట్' పేరిట హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసింది.

ఇందులో ఇన్వైట్ కోడ్స్ అవసరం లేదని, ఇదే దీని ప్రత్యేకతని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. 100 మంది వరకూ ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చని, తమతమ స్క్రీన్స్ షేర్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ యాప్ పూర్తిగా ఉచితమని వెల్లడించింది.

 లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నుంచే పని చేసుకోవడానికి, అధికారులు, సిబ్బందితో కలిసుండటానికి, పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు చెప్పుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ యాప్ ను   https://jiomeetpro.jio.com నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

  • Loading...

More Telugu News