Colors: రోగం కాదు... మాయదారి రోగం... బ్యూటీ పార్లరే ఐసొలేషన్ సెంటర్!

Beauty Parlour Turned into Isolation Center

  • జూబ్లీహిల్స్ లో కలర్స్ బ్యూటీ స్టూడియో
  • రూములను ఐసొలేషన్ గదులుగా మార్చి అద్దెకు
  • దందాను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో మరో సరికొత్త దోపిడీ మొదలైంది. లాక్ డౌన్ కారణంగా మూతబడిన బ్యూటీ పార్లర్ సెంటర్లు, ఇప్పుడు కరోనా భయంతో ఉన్న ప్రజల నుంచి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. వైరస్ సోకి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ఆందోళనతో ఉన్నవారే వీరి టార్గెట్. వ్యాధి బారిన పడిన వారికి బ్యూటీపార్లర్లలోని గదులను ఐసొలేషన్ గదులుగా మార్చి అద్దెలకు ఇస్తూ, రోజుకు రూ. 10 వేల వరకూ ఫీజు వసూలు చేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లో ఉన్న కలర్స్ బ్యూటీ స్టూడియోలో ఈ దందా మొదలైంది. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులకు ఐసోలేషన్ పేరిట ఇక్కడ గదులు అద్దెకివ్వడం ప్రారంభించారు. ఎటువంటి నిబంధనలనూ పాటించడం లేదు. వైద్యం మినహా మిగతా అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలను కల్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్రమ దందాపై ఉక్కుపాదం మోపి, నిర్వాహకులను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News