Vijay Sai Reddy: నేరం చేసినా, సుపారీ ఇచ్చినా ఇప్పుడు తప్పించుకోలేరు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Chandrababu and co
  • మోకా భాస్కరరావు హత్య నేపథ్యంలో విజయసాయి ట్వీట్
  • ఇంకా 1990ల నాటి చిప్ లనే వాడుతున్నారని ఎద్దేవా
  • అప్పట్లో ఈ సాక్ష్యాలు పనికొచ్చేవేమోనంటూ వ్యాఖ్యలు
మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. బాబు లాగే ఆయన క్రిమినల్ మాఫియా ఇంకా 1990ల నాటి చిప్ లనే వాడుతున్నారని ఎద్దేవా చేశారు. "కొల్లు రవీంద్ర... భాస్కరరావు హత్యకు స్కెచ్ వేసి కలెక్టరేట్ కు వెళ్లాడట. సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలు లేనప్పుడు ఈ ఎలిబీలు, సాక్ష్యాలు పనికొచ్చేవేమో కానీ, ఇప్పటిరోజుల్లో నేరం చేసినా, సుపారీ ఇచ్చినా తప్పించుకోలేరు" అంటూ వ్యాఖ్యానించారు. 
Vijay Sai Reddy
Chandrababu
Kollu Ravindra
Moka Bhaskar Rao

More Telugu News