Raghurama Krishnaraju: వృద్ధాప్య పెన్షన్లపై సీఎం జగన్ కు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

Raghgurama Krishnaraju writes CM Jagan
  • ఏపీలో పెన్షన్ దారుల వయసు 60 ఏళ్లకి తగ్గింపు
  • ఇది 2019 జూలై నుంచి వర్తింపచేయాలన్న రఘురామకృష్ణరాజు
  • 7 నెలల కాలానికి రూ.15,750 చెల్లించాలని విజ్ఞప్తి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో వృద్ధాప్య పెన్షన్ల అంశంపై స్పందించారు. వృద్ధాప్య పెన్షన్ దారుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తున్నట్టుగా జీవో ఇచ్చారని, అయితే, ఈ పథకం 2019 జూలై నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా అవ్వాతాతలు 7 నెలల కాలానికి గాను రూ.15,750 నష్టపోయారని వివరించారు.

దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించి నష్టపోయిన మొత్తం లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, ప్రతి ఏడాది పెంచుతామని చెప్పిన రూ.250 పెన్షన్ కానుకను వైఎస్సార్ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈ మేరకు రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు లేఖ రాశారు.
Raghurama Krishnaraju
Jagan
Pensions
Old Age
Andhra Pradesh
YSRCP

More Telugu News