Vhina: బుబోనిక్ ప్లేగు వ్యాధి గుర్తింపు... చైనా అధికారుల హెచ్చరిక!

China Warns world on Bubonic Plague

  • మూడో స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ
  • మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి
  • డిసెంబర్ వరకూ జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వేళ, మంగోలియాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని చైనాలోని బయాన్నూర్ నగర అధికారులు హెచ్చరించారు. మంగోలియాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకుతోందని, 19వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధితో పోలిస్తే, ఇది మరింత బలమైనదని చెబుతూ నగరంలో మూడో స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ సంవత్సరం చివరి వరకూ ఈ హెచ్చరికలు అమలులో ఉంటాయని తెలిపారు.

శనివారం నాడు తూర్పు చైనా ప్రాంతంలోని మంగోలియా పరిధిలో అనుమానిత బుబోనిక్ ప్లేగు కేసులు రెండు వచ్చాయని స్థానిక హెల్త్ కమిషన్ వెబ్ సైట్ పేర్కొంది. మర్మోట్ (పందికొక్కు) మాంసం తినడం వల్ల వీరికి ఈ వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. దీంతో వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేట్ చేశారు. ఈ వ్యాధి మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News