COVAXIN: భారతదేశ తొలి కరోనా టీకా కోవాగ్జిన్‌కు బెలగావిలో తొలి ట్రయల్స్
- ఐసీఎంఆర్, ఎన్ఐవీ సహకారంతో రూపుదిద్దుకున్న టీకా
- పూర్తి ఆరోగ్యంగా ఉన్న 200 మందిపై క్లినికల్ ట్రయల్స్
- ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం
భారతదేశంలో తయారైన తొలి కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు కర్ణాటకలోని బెలగావిలో తొలి ట్రయల్స్ నిర్వహించనున్నారు. భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటిక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. బెలగావిలో దీనిని తొలిసారి పరీక్షించనున్న అధికారులు ఆరోగ్యంగా ఉన్న 200 మంది వలంటీర్ల బృందంపై క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యారు. ఐసీఎంఆర్ పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి ఈ టీకాను వినియోగానికి అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది.