Viral Videos: గాల్లో తేలిపోతూ.. టీవీ చూడాలన్న కలను నెరవేర్చుకున్న యువకుడు.. వీడియో చూసి నెటిజన్ల షాక్

Flying Couch Potato  Paragliding
  • ట‌ర్కీలో ఘటన
  • పారాచూట్ సాయంతో గాల్లోకి ఎగిరిన యువకుడు
  • టీవీ ముందు సోఫా సెట్‌
  • టీవీలో టామ్ అండ్ జెర్రీ చూస్తూ ఎంజాయ్
గాలిలో తేలిపోతూ, చిప్స్‌ తింటూ, కూల్‌ డ్రింకు తాగుతూ టీవీ చూడాలని ట‌ర్కీకి చెందిన పారాగ్ల‌యిడ‌ర్ హ‌స‌న్ కావ‌ల్‌కు బలమైన కోరిక ఉండేది. తాజాగా, ఆయన తన కోరికను నెరవేర్చుకుని ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి షాక్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
                                         
పారాచూట్ సాయంతో ఆయన గాల్లోకి ఎగిరాడు. టీవీ ముందు సోఫా సెట్‌ అంతా సిద్ధం చేసుకుని ఆయన గాల్లోకి ఎగిరాడు. గాల్లో ఎగురుతూ టీవీలో టామ్ అండ్ జెర్రీ చూస్తూ ఎంజాయ్ చేశాడు. గాల్లో ఎగురుతోన్న సమయంలో సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. బ్యాగులో పెట్టుకున్న స్నాక్స్ తీసి తింటూ టీవీ చూస్తూ ఆస్వాదించాడు.
                                                 
Viral Videos
youtube
Social Media

More Telugu News