Guntur District: గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో ఏడుగురు అరెస్ట్‌

Police arrest another 7 accused in guntur btech student case

  • ప్రధాన నిందితులు వరుణ్, కౌశిక్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు
  • ‘మై నేమ్ ఈజ్ 420’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బాధితురాలి ఫొటోలు అప్‌లోడ్
  • త్వరలోనే చార్జి‌షీట్ దాఖలు చేయనున్న పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో పోలీసులు తాజాగా మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. విద్యార్థిని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మణికంఠ అనే యువకుడు ‘మై నేమ్ ఈజ్ 420’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి అందులో బాధితురాలి నగ్న ఫొటోలను అప్‌లోడ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఫొటోలు చూపించి బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్ తర్వాత మణికంఠ, ధనుంజయ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్న పోలీసులు త్వరలోనే ఈ కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News