Corona Virus: చివరి సంవత్సరం డిగ్రీ, పీజీ పరీక్షలు తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు
- కరోనాతో వాయిదా పడుతూ వచ్చిన పరీక్షలు
- పరీక్షలు నిర్వహించేందుకు హోమ్ శాఖ అనుమతి
- నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ
కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన డిగ్రీ, పీజీ ఫైనల్ పరీక్షలను జరిపించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. లాక్ డౌన్ అమలులో ఉన్నా పరీక్షలు నిర్వహించేందుకు విద్యా సంస్థలు, యూనివర్శిటీలకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర హోమ్ శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. డిగ్రీ, పీజీ ఫైనల్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని, అయితే, యూజీసీ మార్గదర్శకాలకు లోబడి ఈ పరీక్షలు జరిపించాలని హోమ్ శాఖ నుంచి కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి లేఖ అందింది. కరోనా నిబంధనలను పాటిస్తూ, పరీక్షలు నిర్వహించవచ్చని ఈ లేఖలో పేర్కొంది. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.