Hyderabad: సింగిల్ బెడ్రూం ఇంటికి రూ. 25,11,467 కరెంటు బిల్లు.. బిత్తరపోయిన యజమాని

Man gets Rs 25 lakh bill for single bedroom flat in Hyderabad

  • హైదరాబాద్‌లోని తార్నాకలో ఘటన
  •  3,45,007 యూనిట్ల విద్యుత్ వాడినట్టు బిల్లు
  • ఫిర్యాదుతో మీటరు మార్చి రూ. రూ. 2,095 బిల్లు

కరోనా వైరస్ కష్టకాలంలో వస్తున్న కరెంటు బిల్లులు గుండెలు గుభేల్ మనిపిస్తున్నాయి. లక్షల్లో వస్తున్న బిల్లులను చూస్తున్న వారు షాక్‌కు గురవుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరెంటు బిల్లుల బాధితులుగా మారగా, తాజాగా హైదరాబాద్‌లోని ఓ సింగిల్ బెడ్రూం ఇంటికి ఏకంగా రూ. 25 లక్షల పైచిలుకు బిల్లు ఇచ్చి తమ పనితనం ఏపాటిదో నిరూపించుకున్నారు తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు.

నగరంలోని లాలాపేట జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌ రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి నివసిస్తున్నారు. ఆదివారం ఆయన ఇంటికొచ్చిన విద్యుత్ సిబ్బంది బిల్లు తీసి ఆయన చేతిలో పెట్టారు. అందులో 121 రోజుల్లో 3,45,007 యూనిట్ల విద్యుత్ వాడినందుకు గాను రూ.25,11,467 బిల్లు వేశారు.

అది చూసిన కృష్ణమూర్తి దానిని పట్టుకుని నిన్న తార్నాకలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బిల్లు చూసిన అధికారులు మీటరులో లోపం ఉందంటూ తీరిగ్గా సెలవిచ్చారు. వెంటనే కొత్త మీటరు బిగించి రూ. 2,095 బిల్లు చేతిలో పెట్టడంతో కృష్ణమూర్తి ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News