Harish Rao: ఇంకా ఆంధ్రప్రదేశ్ పెత్తనం కొనసాగాలని కోరుకుంటున్నారా?: ఉత్తమ్ కుమార్ పై హరీశ్ రావు వ్యాఖ్యలు

Harish Rao refutes Uttam Kumar demand

  • దుమారం రేపిన తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత
  • కేసీఆర్ కు వాస్తు పిచ్చి పట్టిందన్న ఉత్తమ్
  • సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్
  • అవసరమే లేదన్న హరీశ్ రావు

తెలంగాణ సచివాలయ భవనాలను ప్రభుత్వం కూల్చివేస్తుండడం రాజకీయంగా దుమారం రేపింది. 2012-13లో పూర్తయిన భవనాలను ఇప్పుడు కూల్చివేయడం దారుణమని తెలంగాణ కాంగ్రెస్ విభాగం చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. విభజన చట్టం ప్రకారం గవర్నర్ సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తు పిచ్చితో కేసీఆర్ ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మంత్రి హరీశ్ రావు బదులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా హైదరాబాదులోని సెక్రటేరియట్ తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సీఎంల దగ్గర పనిచేసిన మీరు ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతున్నట్టుంది అని విమర్శించారు.

  • Loading...

More Telugu News