ys sharmila: నాన్న గురించి ఈ పుస్తకంలో అమ్మ ధైర్యంగా నిజాలు చెప్పింది: వైఎస్ షర్మిల

ys sharmila about vijayamma book on ysr

  • నాన్న జీవిత విశేషాలపై అమ్మ పుస్తకం రాసింది 
  • హృదయాన్ని తాకే విధంగా ఉంది
  • తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కొత్త కోణాన్ని తెలిపింది
  • నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పింది

మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఆయన అర్ధాంగి విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ... 'నాన్న జీవిత విశేషాలపై అమ్మ రాసిన పుస్తకమే "నాలో.. నాతో వైఎస్సార్‌‌''. ఇది చాలా మంచి పుస్తకం.. హృదయాన్ని తాకే విధంగా ఉంది' అని తెలిపారు.

'నాన్నకు సంబంధించిన విశేషాలను ఈ పుస్తకంలో కొత్త కోణంలో తెలుసుకోవచ్చు. తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కోణాన్ని తెలుపుతూ అమ్మ ఈ పుస్తకం రాసింది. ఈ విధంగా నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మ, నాన్నలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది' అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

'వారిద్దరితో ఎమోషనల్ జర్నీ చేస్తున్నట్లు భావించాను. నిజం చెప్పడం సులభం కాదు .. అయినప్పటికీ ధైర్యంగా అమ్మ నిజం చెప్పింది. ఈ పుస్తకంలో నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను తెలిపింది. వైఎస్సార్ గొప్ప స్ఫూర్తిమంతమైన వ్యక్తి. ఆయనను జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంది. అందుకే అమ్మ ఈ బుక్‌ రాసింది' అని షర్మిల చెప్పారు.

వైఎస్సార్‌ అందరికీ ఒక స్ఫూర్తి అని వైఎస్ షర్మిల అన్నారు. "నాలో.. నాతో వైఎస్సార్‌‌'' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. వైఎస్సార్ జీవిత విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. అందరూ వైఎస్‌ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News