Dharmana Prasad: లోక్ సభ స్థానం ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాను విడదీయొద్దని మనవి: ధర్మాన

Dharmana wants does not divide Srikakulam district on the  basis of Loksabha constituency
  • జిల్లాల సంఖ్యను పెంచాలని భావిస్తున్న ఏపీ సర్కారు
  • ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ధర్మాన
  • శ్రీకాకుళం జిల్లాను విడదీస్తే రాజకీయంగా దెబ్బతింటామని వెల్లడి
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు స్పందించారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే పార్లమెంటు స్థానం ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాను విడదీయొద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాను విడదీయడం వల్ల రాజకీయంగా దెబ్బతింటామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా విభజనపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని, జిల్లా విభజనపై ప్రభుత్వం తమ అభిప్రాయాలు తీసుకోవాలని ధర్మాన స్పష్టం చేశారు.
Dharmana Prasad
Srikakulam District
Division
Loksabha
Constituency
Andhra Pradesh

More Telugu News