Monkey: టవల్ ను మాస్కులా ధరించిన కోతి... అచ్చం మనిషిలా!

Monkey wears a towel like a mask
  • ప్రతి మనిషి జీవితంలో భాగమైన మాస్కు
  • టవల్ ను తల మొత్తం చుట్టేసుకున్న కోతి
  • వీడియో వైరల్
కరోనా మహమ్మారి నివారణలో మాస్కులు ఎంతో ముఖ్యమని వైద్యుల నుంచి ప్రభుత్వాల వరకు అందరూ చెబుతున్న మాట. మాస్కులు ఎప్పటినుంచో ఉన్నా, కరోనా రాక తర్వాత వాటిలో భిన్న రకాలు తయారయ్యాయి. ఇప్పుడు దాదాపు ఎవరిని చూసినా మాస్కుతోనే కనిపిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ కోతి టవల్ ను ముఖానికి రక్షణగా ధరించే ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.

మాస్కు బదులుగా టవల్ ను మనుషులు ఎలా కట్టుకుంటారో కోతి కూడా అలాగే చేయబోయింది. అయితే కళ్లకు ఆ టవల్ అడ్డం పడడంతో కాసేపటికే తీసేసింది. మూతికి అడ్డం చుట్టుకోవాల్సిన టవల్ ను తలమొత్తం కప్పేసుకుంది. మొత్తమ్మీద ఈ కోతి చేష్టల వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా పంచుకున్నారు.

Monkey
Towel
Mask
Corona Virus
Viral Videos

More Telugu News