Padmarao: ఆ ఆడియో క్లిప్పింగ్ ఫేక్.. నాకేం కాలేదు: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు

Padmarao clarifies about his health
  • తెలంగాణ డిప్యూటీ స్పీకర్ కు కరోనా
  • హోం క్వారంటైన్ లో ఉన్న పద్మారావు
  • వాట్సాప్ లో వైరల్ అవుతున్న క్లిప్పింగ్ పై వివరణ
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే, తన గురించి ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దాన్ని నమ్మవద్దని పద్మారావు స్పష్టం చేశారు. వాట్సాప్ లోనూ ఇతర, సామాజిక వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న ఆ క్లిప్పింగ్ లో నిజంలేదని, అది వట్టి ఫేక్ ఆడియో అని వివరించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని, ఆరోగ్యంగానే వున్నానని తెలిపారు. తన క్షేమం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
Padmarao
Corona Virus
Home Quarantine
Audio Clipping
Whatsapp
Social Media

More Telugu News