Chandrababu: ఏపీ కరోనా నివారణ చర్యల్లో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చింది: చంద్రబాబు

Chandrababu ask Centre to intervene AP corona activities
  • పేలవమైన రికవరీ రేటు అంటూ విమర్శలు
  • యాక్టివ్ కేసుల్లో టాప్-5లోకి వచ్చేసిందని వెల్లడి
  • కరోనా సంక్షోభం ముదిరిందంటూ చంద్రబాబు ట్వీట్
ఏపీలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యల తీరుతెన్నులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. పేలవమైన కరోనా రికవరీ రేటు (9.74)తో జాతీయస్థాయిలో ఏపీ అట్టడుగున ఉందని తెలిపారు. అంతేకాదు, అత్యధిక యాక్టివ్ కేసుల (11,200) జాబితాలో  ఐదోస్థానంలోకి వచ్చేసిందని వివరించారు. దీనికితోడు ఫేక్ ఎస్సెమ్మెస్ కరోనా టెస్టుల కుంభకోణం ఈ సంక్షోభాన్ని మరింత ప్రబలం చేసిందని విమర్శించారు. ఏపీ కరోనా నివారణ చర్యల్లో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
Chandrababu
Corona Virus
Andhra Pradesh
Recovery Rate
Active Cases

More Telugu News