Clash: స్పీకర్ తమ్మినేని వెళ్లిపోయిన తర్వాత, రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు

Clashes between YSRCP members in Srikakulam district
  • శ్రీకాకుళంలో రైతు భరోసా కేంద్రానికి స్పీకర్ శంకుస్థాపన
  • చొక్కాలు చిరిగిపోయేలా కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు
  • నాయకులు సర్దిచెప్పడంతో సద్దుమణిగిన ఘర్షణ
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలి ముష్టి యుద్ధానికి దిగారు. ఓ వీధి పోరాటాన్ని తలపించేలా కొట్టుకున్నారు. ఇదంతా స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన అనంతరం జరిగింది.

స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లాలోని ఆమదాలవలస మండలం దన్ననపేటలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెళ్లాడో, లేదో స్థానిక వైసీపీ కార్యకర్తల్లో వైషమ్యాలు బట్టబయలయ్యాయి. పోలీసులు ఉన్నా గానీ లెక్కచేయకుండా చొక్కాలు చిరిగిపోయేలా పరస్పరం దాడులు చేసుకున్నారు.   నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Clash
YSRCP
Tammineni Sitaram
AP Speaker
Srikakulam District

More Telugu News