Pawan Kalyan: పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్ కు 4 మిలియన్ల ఫాలోవర్లు... కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని

Pawan thanked four million followers
  • ప్రత్యేకంగా పోస్టు చేసిన పవన్
  • ఇతరులకు భిన్నంగా కఠిన మార్గాన్ని ఎంచుకున్నామన్న పవన్
  • జనసైనికులకు రాజకీయం అంటే దేశ సేవేనని వెల్లడి
టాలీవుడ్ అగ్రహీరో, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తాజాగా ఆయన ట్విట్టర్ లో 4 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ మైలురాయిని అందుకున్న సందర్భంగా పవన్ ట్విట్టర్ లో ప్రత్యేకంగా పోస్టు చేశారు. మార్పును కోరుకుంటున్న ఈ 40 లక్షల మందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు తన సందేశంలో పేర్కొన్నారు.

"'స్వాతంత్ర్య సమర త్యాగాలు, రాజ్యాంగ సిద్ధాంతాలు, సనాతన ధర్మ విలువల ఆధారంగా జనసేన పార్టీ రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఇతరులకు భిన్నంగా జనసేన కఠినమైన మార్గాన్ని ఎంచుకుంది. జనసైనికులకు రాజకీయం అంటే దేశ సేవే . విభజన రాజకీయాలు, ప్రతీకార ధోరణులు, సోషల్ మీడియాలో విషపూరిత ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత ఆరోపణల నడుమ మార్పు కోరుకునే వాళ్లకు జనసేన పార్టీ ఓ వెలుగు దివ్వె" అని వివరించారు. తనను ఫాలో అయ్యే 4 మిలియన్ల మంది కూడా ఇదే తరహాలో బాధ్యతాయుతమైన, జవాబుదారీ రాజకీయాల కోసం పాటుపడతారని భావిస్తున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
Followers
Twitter
Social Media
Janasena

More Telugu News