Allu Arjun: ఊరికి దూరంగా.. ప్రశాంత వాతావరణంలో అల్లు అర్జున్ వాకింగ్

 Allu Arjun walks in the morning at a suburb place
  • సోషల్ మీడియాలో ఫొటో పంచుకున్న బన్నీ
  • మార్నింగ్ వాక్ అంటే ఇష్టమంటూ క్యాప్షన్
  • ఫొటోకు విపరీతమైన స్పందన
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ లాక్ డౌన్ కారణంగా తన కుటుంబంతోనే అధిక సమయం గడుపుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులతో అభిమానులను అలరిస్తున్న అల్లు అర్జున్ తాజాగా మార్నింగ్ వాక్ కు సంబంధించిన ఫొటో పంచుకున్నాడు. మార్నింగ్ వాక్ ను బాగా ఇష్టపడతానంటూ క్యాప్షన్ పెట్టాడు. షార్ట్స్, షూస్ ధరించిన బన్నీ చేతిలో వాటర్ బాటిల్ తో నడుస్తూ కనిపించాడు. నగరానికి దూరంగా శివారు ప్రాంతంలోకి వచ్చిన బన్నీ కారును రోడ్డుపక్కగా ఆపి వాకింగ్ చేశాడు. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా దీనికి లైక్ కొట్టారు.
Allu Arjun
Walking
City
Suburb
Instagram
Social Media
Tollywood

More Telugu News