Pawan Kalyan: అప్పట్లో మీరు గాయపడితే మా కుటుంబం మొత్తం తల్లడిల్లిపోయింది: అమితాబ్ ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

Pawan Kalyan reacts after Amitab and Abhishek tested corona positive
  • అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్
  • అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా నిర్ధారణ
  • ఈ వార్త వినగానే ఎంతో బాధ కలిగిందన్న పవన్
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ రావడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. తామంతా అమితాబ్ బచ్చన్ అభిమానులమని పవన్ వెల్లడించారు. మీరంటే మాకెంతో ప్రేమ... అందుకు మీ ప్రతిభ ఒక్కటే కారణం కాదు.. మీ పోరాటస్ఫూర్తి, నిరాడంబరత, వినయవిధేయతలు కూడా కారణాలే అంటూ ట్వీట్ చేశారు.

"నాకిప్పటికీ గుర్తు. అప్పట్లో మీరు 'కూలీ' చిత్రం షూటింగ్ సందర్భంగా గాయపడితే మా కుటుంబం యావత్తు తల్లడిల్లిపోయింది. మా అమ్మ, నాన్నతో సహా ప్రతి ఒక్కరం మీ ఆరోగ్యం కోసం ప్రార్థించాం. అన్ని వయసుల వారి నుంచి మీరు ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు అందుకుంటున్నారు. కానీ.. మీరు, మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారని తెలియగానే ఎంతో బాధపడ్డాను. ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని, మీరు, అభిషేక్ సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతరించుకోవాలని ఆశిస్తున్నాను... ఇట్లు మీ అభిమాని పవన్ కల్యాణ్" అంటూ సందేశం వెలువరించారు.
Pawan Kalyan
Amitabh Bachchan
Abhishek Bachchan
Corona Virus
Positive

More Telugu News