Probe Committee: వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై విచారణ కమిటీ నియమించిన యూపీ సర్కారు
- గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ లో హతం
- రిటైర్డ్ జడ్జి శశికాంత్ అగర్వాల్ నేతృత్వంలో కమిటీ
- రెండు నెలల్లో నివేదిక సమర్పించాలంటూ నివేదిక
కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను కాన్పూర్ సమీపంలో ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు రిటైర్డు జడ్జి శశికాంత్ అగర్వాల్ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తారు.
కమిటీ కాన్పూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి గడువు విధించారు. కాగా, వికాస్ దూబేకు పోలీసులతో ఉన్న సంబంధాలపైనా, ఇతర ప్రభుత్వ శాఖలతో లింకులపైనా ఈ కమిటీ దృష్టి సారించనుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పలు మార్గదర్శకాలను కూడా కమిటీ తన నివేదికలో సూచించనుంది.