nepal: మీ మీడియా కథనాలు తప్పుదారి పట్టించేలా వున్నాయి: భారత్‌కు లేఖ రాసిన నేపాల్‌ ప్రభుత్వం

nepal writes letter to india

  • భారత మీడియాలో వస్తోన్న వార్తలపై అభ్యంతరాలు
  • తమ పౌరుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని వ్యాఖ్య
  • దౌత్య సంబంధాలు బలహీనమవుతాయన్న నేపాల్

భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ ప్రభుత్వ తీరుపై ఇక్కడి మీడియాలో వస్తోన్న వార్తలపై ఆ దేశం అభ్యంతరాలు తెలిపింది. భారత మీడియాలో వస్తోన్న కథనాలు తమ దేశ పౌరుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ నేపాల్ సర్కారు పేర్కొంది.

ఇలాంటి కథనాల వల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనమవుతాయని తెలిపింది. భారత మీడియాలో తమ దేశంపై వస్తున్న కథనాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని నేపాల్‌ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ వార్తలు తమ దేశ రాజకీయ నేతలను అపఖ్యాతి పాలు చేసేలా ఉన్నాయని ఆరోపణలు గుప్పించింది.

ఇలాంటి వార్తలను కట్టడి చేయాలని భారత్‌ను నేపాల్‌ సర్కారు కోరింది. నేపాల్‌లో డీడీ న్యూస్ మినహా భారతీయ న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నట్లు నేపాలీ కేబుల్ టీవీ ప్రొవైడర్లు ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఈ లేఖ రాయడం గమనార్హం.

  • Loading...

More Telugu News