Film Industry: సినీ పరిశ్రమలో సరికొత్త విభాగం?

Film industry to introduce Covid Protection wing

  • షూటింగులపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా
  • కోవిడ్ ప్రొటెక్షన్ అనే విభాగాన్ని ప్రారంభించే యోచనలో ఇండస్ట్రీ
  • యూనిట్ కరోనా బారిన పడకుండా కాపాడటమే ఈ విభాగం పని

కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై భారీగా ఉంది. ఎక్కిడికక్కడ షూటింగులు ఆగిపోయాయి. షూటింగులు జరుగుతున్న ఒకటి, రెండు చోట్ల కూడా నటులు, సిబ్బంది కరోనా బారిన పడుగున్నారు. తాజాగే ఏకంగా అమితా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలడంతో... సిని పరిశ్రమ షాక్ కు గురైంది. షూటింగులను ఎలా నిర్వహించాలా? అని పునరాలోచనలో పడింది. కరోనా రక్కసి నుంచి యూనిట్ ను కాపాడటంపై దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో, ఇండస్ట్రీలో కోవిడ్ ప్రొటెక్షన్ అనే సరికొత్త విభాగాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి సినీ పెద్దలు వచ్చినట్టు సమాచారం. అవుట్ డోర్ లో కానీ, ఇండోర్ లో కానీ యూనిట్ లో ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టడమే ఈ విభాగం పని. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ విభాగం రక్షణ చర్యలను చేపడుతుంది. ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' షూటింగును ఈ విధానం ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. కెమెరాలను, కాస్ట్యూమ్స్ ను ప్రత్యేకమైన పద్ధతుల్లో శుభ్రపరుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News