Mahesh Babu: డిస్ ప్లే పిక్ ను మార్చేసిన టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్!

Mahesh Babu Changed DP
  • డీపీ, ప్రొఫెల్ పిక్ లను మార్చిన మహేశ్ బాబు
  • తెగ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
  • ఏదో సెంటిమెంట్ ఉందంటున్న సోషల్ మీడియా
తోటి సెలబ్రిటీలంతా తరచుగా సోషల్ మీడియా డిస్ ప్లే పిక్ లను మారుస్తూ ఉంటే, మహేశ్ బాబు చాలా కాలం నుంచి ఒకటే పిక్ ను కొనసాగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, మహేశ్ కూడా తన పిక్ ను మార్చేశారు. ఇదే సమయంలో ప్రొఫైల్ పిక్ ను కూడా ఆయన మార్చేశారు. ఈ రెండూ మహేశ్ కొత్త ఫోటోలే కావడం గమనార్హం. వీటిని చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.

కాగా, వాస్తవానికి సెంటిమెంట్స్ ను అధికంగా నమ్మే మహేశ్ తన సినిమాల ప్రారంభోత్సవాలకు కనిపించరు. గతంలో కొన్ని చిత్రాల ముహూర్తాల సమయంలో కనిపించడంతో అవి ఫ్లాప్ అవడమే ఇందుకు కారణం. తాజాగా డీపీలను మార్చడం వెనుక కూడా ఏదో మర్మం ఉండే ఉంటుందని సోషల్ మీడియా టాక్.
Mahesh Babu
Display Pic
Social Media

More Telugu News