Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా టెస్టులు, చికిత్స ఇక పూర్తి ఉచితం!

Telangana govt take key decision on corona treatment

  • రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఎంపిక చేసిన ప్రభుత్వం
  • త్వరలో విధివిధానాల ప్రకటన 

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయడంతోపాటు, చికిత్సను కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. వీటిలో ఇకపై కరోనా పరీక్షలతోపాటు, కరోనా చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం  37,745 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 375 మంది మరణించారు.

  • Loading...

More Telugu News