Dutee Chand: బీఎండబ్ల్యూ కారును ఎందుకు అమ్మాల్సి వచ్చిందో వివరించిన స్ప్రింటర్ ద్యుతీచంద్

Dutee chand explains why she decide to sell her BMW car
  • కారును నిర్వహించే స్తోమత లేదని వెల్లడి
  • బీఎండబ్ల్యూ కారు నిర్వహణ వ్యయం ఎక్కువన్న ద్యుతీ
  • భవిష్యత్తులో ఆ కారును మళ్లీ కొంటానని వివరణ
భారత అథ్లెటిక్ రంగంలో ఎంతో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకున్న యువ స్ప్రింటర్ ద్యుతీచంద్ ఇటీవల తన బీఎండబ్ల్యూ కారును అమ్మకానికి పెట్టిందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె తన కారును అమ్ముతున్నట్టు ట్వీట్ చేయడం, ఆపై వెంటనే తొలగించడం మరింత ఆసక్తి కలిగించింది. శిక్షణకు డబ్బుల్లేక ఖరీదైన కారును అమ్మేస్తోందని ప్రచారం జరిగింది. దీనిపై ద్యుతీచంద్ వివరణ ఇచ్చింది.

ట్రైనింగ్ కు డబ్బుల్లేక కారును అమ్ముతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కారును మెయింటైన్ చేయలేకపోతున్నానని, ఆ కారు నిర్వహణ వ్యయాన్ని భరించలేకపోతున్నానని వెల్లడించింది. అంతటి కారును భరించే ఆర్థిక స్తోమత లేదని వివరించింది. అయితే కారును అమ్మితే వచ్చే డబ్బును తన శిక్షణ కోసం కూడా ఉపయోగిస్తానని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు ఒడిశా సర్కారు, తాను చదువుకున్న కేఐఐటీ వర్సిటీ ఎంతో చేయూత అందించాయని, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు రాగానే, మళ్లీ ఆ కారును దక్కించుకుంటానని ద్యుతీచంద్ వివరించింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి, వర్సిటీకి తన కారణంగా ఆర్థిక ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నానని వివరించింది.
Dutee Chand
BMW Car
Sell
Maintainance
Sprinter

More Telugu News