Culcutta Highu Court: మైలార్డ్, లార్డ్‌షిప్ వంటి వాటిని పక్కనపెట్టేయండి.. సింపుల్‌గా సర్ అనండి: కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాధాకృష్ణన్
- కిందిస్థాయి కోర్టుల నుంచి జిల్లా న్యాయాధికారుల వరకు అందరూ అలాగే పిలవండి
- ఆయన సూచనను అందరికీ పంపిన హైకోర్టు రిజిస్ట్రార్
కోర్టులో న్యాయవాదులు న్యాయమూర్తులను సంబోధించడంపై కలకత్తా హైకోర్టు చీఫ్ జసిస్ట్ టీబీఎన్ రాధాకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పిలుస్తున్న ‘మైలార్డ్’, ‘లార్డ్‌షిప్’ అంటూ సంబోధించడాన్ని వదిలిపెట్టాలని సూచించారు. తనను సింపుల్‌గా ‘సర్’ అని పిలిస్తే సరిపోతుందని అన్నారు.
బెంగాల్, అండమాన్‌లోని న్యాయాధికారులందరూ తనను సర్ అనే పిలవాలని కోరారు. ఇకపై జిల్లా న్యాయాధికారులు, హైకోర్టు సిబ్బంది కూడా తనను సర్ అనే పిలవాలని అన్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ చేసిన సూచనలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాయ్ చటోపాధ్యాయ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని జిల్లా న్యాయమూర్తులు, కింది కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు పంపారు.