Telangana: పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న కేంద్రం.. సచివాలయం కూల్చివేత పనులు మళ్లీ ప్రారంభం!

Telangana secretariat demolition works started

  • సచివాలయం కూల్చివేతకు తొలగిన అడ్డంకులు
  • వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
  • గంటల వ్యవధిలోనే ప్రారంభమైన కూల్చివేతలు

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు అనుమతించిన గంటల వ్యవధిలోనే... కూల్చివేత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవలే కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత... ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కూల్చివేతలు పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్ పిటిషన్లు వేశారు. వారం రోజులుగా ఈ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

ఈ నేపథ్యంలో సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో, కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సెక్రటేరియట్ ను కూల్చవచ్చని తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కూల్చివేత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News