Rain: నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలకు అవకాశం!
- చురుకుగా ఉన్న రుతుపవనాలు
- శని, ఆది వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- కోస్తా, రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
రుతుపవనాలు అత్యంత చురుకుగా ఉన్నందున రాగల 48 గంటల్లో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. 18, 19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమ ప్రాంతంలో 20న భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. కాగా, శుక్రవారం నాడు కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి. నిన్న ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.