Election Commission: ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరిన ఎన్నికల సంఘం
- ఎన్నికల ప్రచారాలు, సమావేశాలను ఎలా నిర్వహించుకోవచ్చు?
- జాతీయ, ప్రాంతీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాలి
- ఈ నెల 31 వరకు సమయం: ఈసీ
దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలు, సమావేశాలను ఎలా నిర్వహించుకోవాలన్న అంశాలపై అభిప్రాయాలు తెలపాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. తమ అభిప్రాయాలను పంపేందుకు ఈ నెల 31 వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపింది.
కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సి ఉండగా, ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలోని పార్టీలతో ఇప్పటికే వర్చువల్ సమావేశం నిర్వహించింది. అలాగే, కరోనా రోగులకు పోస్టల్ బ్యాలెట్ పధ్ధతిలో ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీజేపీ సహా పలు పార్టీలు వర్చువల్ పద్ధతిలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి.