Ram Mandir: ఆగస్టులో రామమందిర నిర్మాణానికి భూమి పూజ... పూజ చేసిన రోజే నిర్మాణ పనులు ప్రారంభం
- ఆగస్టు మొదటివారంలో భూమి పూజ
- భూమి పూజకు రావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం
- దేశవ్యాప్త విరాళాల సేకరణకు ట్రస్టు సిద్ధం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో వచ్చే నెలలో లాంఛనంగా నిర్మాణం ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటివారంలో భూమి పూజ నిర్వహించనున్నారు. ఆగస్టు 3న కానీ, 5వ తేదీన కానీ భూమి పూజ నిర్వహించి, అదే రోజున నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ఇవాళ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కాగా, భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నారు. వర్షాకాలం తర్వాత రాష్ట్రాల వ్యాప్తంగా తిరిగి 10 కోట్ల కుటుంబాలను సంప్రదిస్తామని, కరోనా సద్దుమణిగాక దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించే అవకాశం ఉందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.