YS Vivekananda Reddy: హత్య కేసులో దర్యాప్తు.. పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ అధికారులు

cbi probe on viveka murder case

  • అక్కడి నుంచి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి అధికారులు
  • కేసుకు సంబంధించిన వివరాల సేకరణ
  • గత ఏడాది వివేకానందరెడ్డి సొంతింట్లోనే దారుణ హత్య

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు వివేకా హత్యకేసు వివరాలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించి, అక్కడి నుంచి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.

ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. గత ఏడాది మార్చి 15న వివేకానందరెడ్డి సొంతింట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, మొత్తం 1,300 మంది అనుమానితులను సిట్‌ అధికారులు విచారించారు.

అయినప్పటికీ ఈ కేసును ఛేదించలేకపోయారు. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News