TikTok: అమెరికా సంస్థగా టిక్‌టాక్‌ సేవలు కొనసాగించే అవకాశం: వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారుడు

tiktok activities from usa

  • చైనా తీరుతో ఆ దేశ యాప్‌లపై ప్రభావం
  • వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారుడు ల్యారీ కుడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు
  • టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన సంస్థ సొంతం చేసుకునే అవకాశం?

కరోనాను వూహాన్‌ దాటకుండా కట్టడి చేసిన చైనా... తమ దేశం నుంచి ప్రపంచానికి వ్యాప్తి చెందకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ వస్తోన్న విమర్శల ప్రభావం ఆ దేశానికి చెందిన యాప్‌లపై పడుతోన్న విషయం తెలిసిందే. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను భారత్‌ నిషేధించింది. అదే విధంగా అమెరికా కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ టిక్‌టాక్‌ తమ ప్రధాన కార్యాలయాన్ని ఇతర దేశానికి మార్చాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారుడు ల్యారీ కుడ్లో టిక్‌టాక్‌కు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. టిక్‌టాక్‌ తన మాతృ సంస్థ బైట్‌డాన్స్ నుంచి విడిపోయి అమెరికా సంస్థగా సేవలు కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు. టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన సంస్థలు సొంతం చేసుకోవాలని చూస్తున్నాయా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన స్పందించలేదు.

  • Loading...

More Telugu News