TS High Court: మేము చివాట్లు పెడుతుంటే అభినందించామని చెపుతారా?: తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

You are hiding information in corona bulletin TS High Court slams govt

  • తక్కువ టెస్టులు చేస్తున్నారు
  • మా ఆదేశాలను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
  • కరోనా బులెటిన్ లో వాస్తవాలను దాస్తున్నారు

రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ టెస్టులు, సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడిస్తున్న తీరు పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ తమ ఆదేశాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని... వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఢిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో జరుగుతున్న కరోనా టెస్టులు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కేసులు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని... ప్రభుత్వం నిద్రపోతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కరోనా బులెటిన్, ఆసుపత్రుల్లోని బెడ్ల సంఖ్యపై అధికారులు కావాలనే వాస్తవాలను దాస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి విషయంలో హైకోర్టు అభినందించిందని బులెటిన్ లో పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంటే... అభినందించినట్టు చెపుతూ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News