Nara Lokesh: కరోనా కట్టడికే పెట్రోల్ ధరలు పెంచానంటారేమో ఈ మేధావి!: లోకేశ్ వ్యంగ్యం
- విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచారు
- పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు
- మద్య నిషేధం కోసమే లిక్కర్ ధరలు పెంచామన్నారు
- ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపుపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.
ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. మద్య నిషేధం కోసమే లిక్కర్ ధరలు పెంచామన్న మేధావి, ఇప్పుడు కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమోనంటూ లోకేశ్ వ్యంగ్యంగా అన్నారు.