Uttar Pradesh: ఉత్తరాఖండ్ లో పర్వతాలపైకి భారీ పరికరాలను ఇలా ఎక్కిస్తారు... వీడియో ఇదిగో!

Tractor Claimbing Steps of Kedarnath
  • కేదార్ నాథ్ కు భారీ పరికరాల తరలింపు
  • నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ట్రాక్టర్
  • సుశాంత్ నందా ట్వీట్ చేసిన వీడియో వైరల్
ఉత్తరాఖండ్ లో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ పేరు అందరికీ తెలిసిందే. అత్యంత క్లిష్టమైన మార్గంలో సరైన రహదారులు లేని ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు అక్కడ సకల సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. కానీ వాటిని ఎలా సమకూరుస్తారు? ఆ విషయాన్ని తెలిపేదే ఈ వీడియో...

తాజాగా, కేదార్ నాథ్ ప్రాంతానికి అవసరమైన ఓ భారీ పరికరాన్ని ట్రాక్టర్ పైకి ఎక్కించగా, దాన్ని అక్కడికి ఎలా తీసుకుని వెళతారన్న వీడియో వైరల్ అయింది. ట్రాక్టర్ మెట్ల పైకి ఎక్కుతూ ఉంటే, ముందు రెండు చక్రాలూ గాల్లోకి లేస్తున్న వేళ, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంతమంది ముందు ఎక్కారు. వెనుక మరి కొంతమంది ట్రాక్టర్ పడిపోకుండా చూస్తుంటే, ఒక్కో మెట్టు ఎక్కుతున్న వీడియో ఇది.

పక్కనే లోయ, ఏ మాత్రం పట్టుతప్పినా, కొందరు ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ "ఇది భారత్ లో మాత్రమే సాధ్యమవుతుంది" అని క్యాప్షన్ పెట్టారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.
Uttar Pradesh
Kedarnath
Tractor
Viral Videos

More Telugu News