iran: 'అమెరికాను దెబ్బ కొడతాం'.. ఇరాక్‌ ప్రధానితో భేటీలో చెప్పిన 'ఇరాన్' సుప్రీం లీడర్‌ ఆయతుల్లా ఖొమైనీ

Iran will strike reciprocal blow against US

  • సులేమానీ మృతిపై రగిలిపోతోన్న ఇరాన్
  • కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్న ఆయతుల్లా
  • చైనా, ఇరాక్‌‌తో సత్సంబంధాలు పెంచుకుంటోన్న ఇరాన్

కొన్ని నెలల క్రితం అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ కీలక సైనిక కమాండర్ కాసిం సులేమానీ హతమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది. సులేమానీ మృతిపై ఇప్పటికీ అమెరికాపై ఇరాన్ ఆగ్రహంగానే ఉంది. ఆయన హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, అమెరికాను దెబ్బకొడతామని ఆ దేశ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా ఖొమైనీ చెప్పారు. ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌- కధిమితో తాజాగా ఆయన సమావేశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, సులేమానీ గురించి అగ్రరాజ్యానికి సమాచారమిచ్చిన తమ పౌరుడిని ఉరి తీసేందుకు ఇరాన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు ఇరాన్‌ న్యాయశాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో చైనాతో ఇరాన్ సత్సంబంధాలు పెంచుకుంటుండడం గమనార్హం. ఇరాక్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకే ఆయా దేశాలతో చర్చలు జరుపుతోంది.

  • Loading...

More Telugu News