CPI Narayana: జగన్ కు అన్ని దారులు మూసుకుపోయాయి: నారాయణ

All roads for Jagan are closed says CPI Narayana

  • ఏపీ రాజ్యంగ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది
  • జగన్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారు
  • ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదేశించడంతో... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల పర్వానికి తెరలేపాయి. తాజాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని గవర్నర్ ఆదేశించడం శుభపరిణామమని నారాయణ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి జగన్ కు అన్ని దారులు మూసుకుపోయాయని చెప్పారు. జగన్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పటికైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని చెప్పారు. రాజకీయాలలో పట్టువిడుపులు అవసరమని... మొండిగా ముందుకెళ్లడం సరికాదని అన్నారు.

  • Loading...

More Telugu News