Donald Trump: చైనా 'కరోనా వ్యాక్సిన్'‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

we will work with china says trump

  • తొలి వ్యాక్సిన్ చైనా తీసుకొస్తే? అన్న ప్రశ్నకు సమాధానం
  • మంచి ఫలితాలను అందించే ఏ దేశంతోనైనా పని చేస్తాం
  • వ్యాక్సిన్‌ ఊహించిన సమయానికన్నా ముందుగానే వస్తుంది
  • అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం

కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పుట్టినిల్లు చైనాలో తొలి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే ఆ దేశం‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమా? అని మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. మానవాళికి మంచి ఫలితాలను అందించే ఏ దేశంతోనైనా పని చేసేందుకు తాము సిద్ధమేనని చెప్పారు.

తమ దేశంలో కరోనా వ్యాక్సిన్‌తో పాటు, కరోనాను తగ్గించే ఔషధాల తయారీలో కూడా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారని ట్రంప్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ ఊహించిన సమయం కన్నా ముందుగానే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా సైన్యం వ్యాక్సిన్‌ పంపిణీలో సహకరిస్తుందని చెప్పారు.

కాగా, కరోనా విజృంభణ ఆగట్లేదని, అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశముందని ట్రంప్ తమ దేశ ప్రజలకు తెలిపారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్‌ కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. కరోనా నియంత్రణే కాకుండా, ఆ వైరస్‌ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News