Andhra Pradesh: ఏపీలో కరోనా మరణమృదంగం.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు!
- గత 24 గంటల్లో 6,045 కేసుల నమోదు
- 64,713కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
- ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 823
కరోనా మహమ్మారి దెబ్బకు ఏపీ తల్లడిల్లుతోంది. మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. రోజురోజుకూ కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామాలకు సైతం కరోనా విస్తరిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 6,045 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
వీటిలో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,049 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, గుంటూరు 842, కడప 229, కృష్ణా 151, కర్నూలు 678, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విజయనగరం 107, పశ్చిమగోదావరి జిల్లాలో 672 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,713కి పెరిగింది.
గత 24 గంటల్లో కరోనా బారిన పడి మొత్తం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 15, కృష్ణలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరులో 5, కర్నూలులో 5, విజయనగరంలో 4, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 3, కడప, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 823కి చేరింది. మరిన్ని వివరాల కోసం కింది టేబుల్ చూడండి.