India: బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. కరోనా కాలంలో కూడా వేతన పెంపు, ప్రోత్సాహకాలు!

Salary Hike fro PSU Bank Employees

  • 15 శాతం వరకూ వేతనాల పెంపు
  • పెన్షన్ కంట్రిబ్యూషన్ 4 శాతం పెంపు
  • లాభాల్లో ఉన్న బ్యాంకు ఉద్యోగులకు ఇన్సెంటివ్ లు
  • ఐబీఏతో ఉద్యోగ సంఘాల చర్చల్లో నిర్ణయం

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఎన్నో రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు మాత్రం తీపి కబురు అందింది. దేశవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త చెబుతూ, 15 శాతం జీతాల పెంపుతో పాటు, నాలుగు శాతం పెన్షన్ కంట్రిబ్యూషన్ ను పెంచేందుకు ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్), ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెంపు నవంబర్ 2017 నుంచే అమలులోకి రానుంది. దీని ప్రకారం, గతంలో బేసిక్ వేతనంలో 10 శాతం పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుండగా, ఇకపై 14 శాతం బేసిక్ వేతనం, డీఏలు పెన్షన్ మొత్తానికి జమ కానున్నాయి. ఈ నిర్ణయంతో ఉద్యోగుల వేతనాల బిల్లు సంవత్సరానికి రూ. 7,900 కోట్ల మేరకు పెరుగుతుంది. ఇక, 5 శాతానికి మించిన నిర్వహణా లాభాలను సాధించిన బ్యాంకుల ఉద్యోగులకు అదనంగా ఇన్సెంటివ్ లు కూడా అందనున్నాయి.

  • Loading...

More Telugu News