Jagan: రైతుల పంట నిల్వ కోసం ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి: ఏపీ సీఎం జగన్
- గోదాములు, కోల్ట్ స్టోరేజిలపై సీఎం జగన్ సమీక్ష
- వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని ఆదేశాలు
- రూ.4 వేల కోట్లతో నిధి
రాష్ట్రంలో రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ కు దన్నుగా నిలుస్తామని పేర్కొన్నారు.
రైతులు తమ పంట నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. తన వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్ కు చేరాలని స్పష్టం చేశారు. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటునివ్వాలని అన్నారు. కనీస గిట్టుబాటు ధర లేని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవాలని సూచించారు. సెప్టెంబరు నాటికి దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు.