Rahul Gandhi: మోదీ బలం, ఇండియా బలహీనత ఇదే: రాహుల్ గాంధీ
- స్ట్రాంగ్ మేన్ అనే కృత్రిమ ఇమేజ్ ను మోదీ సృష్టించుకున్నారు
- చైనా సమస్యను ప్రపంచ దృష్టి కోణం నుంచి చూడాలి
- పెద్ద ఆలోచనలు మాత్రమే ఇండియాను కాపాడతాయి
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లో చైనా దూకుడుపై ట్వట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ... ఈ సమస్యను ప్రపంచ దృష్టి కోణం నుంచి చూడాలని సూచించారు. ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని... వన్ మేన్ ఇమేజ్ అనేది జాతీయ దృష్టికి ప్రత్యామ్నాయం కాదని చెప్పారు.
ప్రధాని మోదీ తన ఇమేజ్ ను పెంచుకోవడం పైనే పూర్తి ఫోకస్ పెట్టారని రాహుల్ విమర్శించారు. రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు 'స్ట్రాంగ్ మేన్' అనే కృత్రిమ ఇమేజ్ ను మోదీ సృష్టించుకున్నారని చెప్పారు. ఈ ఇమేజ్ మోదీకి బలమని... ఇదే సమయంలో ఇండియా వీక్ నెస్ కూడా అదేనని అన్నారు.
ఒక పక్కా ప్రణాళిక లేకుండా చైనాను ఢీకొనలేమని రాహుల్ అన్నారు. కేవలం అంతర్జాతీయ దృష్టి కోసం నుంచి ఈ సమస్యను ఎదుర్కోవాలని చెప్పారు. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని... భారత్ కూడా ఇలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. పెద్ద ఆలోచనలు మాత్రమే ఇండియాను కాపాడతాయని చెప్పారు.